హైదరాబాద్ ఫీనిక్స్ గ్రూప్ మరియు దాని యొక్క విభాగము, ఫీనిక్స్ ఫౌండేషన్ గుంటూరు పురపాలక సంస్థతో మరియు చుక్కపల్లి శంకరరావు ధార్మిక సంస్థతో కలిసి కొరిటెపాడు స్మశాన వాటికను ఆధునికరీతిలో నవీకరించబడిన సదుపాయాల, సౌకర్యాలతో అభివృద్ధి చేయుటకు ఆరంభాలను ప్రారంభించింది. ప్రస్తుతము ఇది వైకుంఠధామముగా నామకరణము చేయబడినది. ఫీనిక్స్ ఫౌండేషన్ ఇది ప్రపంచంలోనే భారీగా చర్యలు చేపట్టి హైదరాబాద్ నందు జూబిలీహిల్స్ మరియు పంజాగుట్ట వద్ద ఉన్న స్మశాన వాటికలను మరియు తెలంగాణ రాష్ట్రములోని సిద్ధిపేట మరియు గజ్వేల్ స్మశాన వాటికలను వైకుంఠధామాలుగా ఆధునీకరించింది. ఈ స్మశాన వాటికల నందు గణనీయమైన నాణ్యతతో కూడిన సదుపాయాలను మరియు సౌకర్యాలను చూడవచ్చును. ఒకప్పుడు అపరిశుభ్రత, అనారోగ్యకరమైన వాతావరణం మరియు చెత్త మొదలగు వాటితో అసహ్యకరరీతిలో ఉండిన ఈ స్మశాన వాటికలు, ఈ రోజు శుభ్రంగా, పచ్చదనంగా శోభాయమానంగా మరియు కళాత్మకంగా మార్చబడ్డాయి. ఫీనిక్స్ ఫౌండేషన్ ఈ రకమైన మార్పులకు శ్రీకారం చుట్టి నిబద్దతతో కూడిన కృషితో వీటిని ఈ విధంగా అభివృద్ధి చేసింది మరియు దేశ వ్యాప్తంగా పందోమ్మిది స్మశాన వాటికలు అభివృద్ధి పర్చడానికి కంకణం కట్టుకున్నది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి నడిబొడ్డున గుంటూరు నెలకొనియున్నది మరియు పెద్దపట్టణం నుండి గుంటూరు ప్రముఖ నగరంగా రూపుదిద్దుకుంటున్నది. విజయవాడతో పాటు గుంటూరు ఉన్నతమైన విద్యాసంస్థలతో కూడి ప్రగతి ప్రధాన సాగుతున్న పట్టణము. పెరిగిన జీవన ప్రమాణాలతో మరియు జీవన స్థాయిలతో ఉన్న గుంటూరు పట్టణంలో, అన్ని సదుపాయాలు మరియు సౌకర్యాలతో ఆధునికంగా ఉండే స్మశాన వాటిక ఉండవలసిన ఆగత్యాన్ని ఫీనిక్స్ ఫౌండేషన్ గుర్తించి అంతిక్రియల అవసరాలను తీర్చటానికి కొరిటెపాడులో స్మశాన వాటికను పూర్తిస్థాయిలో విజయవంతంగా అన్ని ఆధునిక సౌకర్యాలతో నెలకొల్పింది. ఇప్పుడు వైకుంఠధామంగా పిలవబడుతుంది.
ఈ రోజు, కొరిటెపాడులో పురపాలక సంస్థ స్మశాన వాటిక వైకుంఠధామము, అంతిక్రియలు సనాతన కర్మాచారాల ప్రకారం అన్ని విధాలుగా ఘనంగా చేయబడటానికి చాలా సంతృప్తికరమైన మరియు ఆధునికమైన సౌకర్యాలు కలిగియున్నదీ.